Feb 26,2023 01:12
డాక్టర్‌ రమాదేవిని సత్కరిస్తున్న కళాశాల సిబ్బంది

ప్రజాశక్తి-నగరం: మండల కేంద్రమైన నగరంలో వెలగపూడి రామకృష్ణ కళాశాలకు ఇతోథికంగా సాయమం దించిన అమెరికాలో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్‌ దేవభక్తుని రమాదేవికి శనివారం సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ అనగాని హరికృష్ణ అధ్యక్షత వహిం చారు. హరికృష్ణ మాట్లాడుతూ సేవా దృక్పథం తో జీవిస్తున్న ఇలాంటి వాళ్లు సమాజానికి ఆదర్శ ప్రాయులని కొనియాడారు. గ్రామీణ ప్రాంతం లోని ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కళాశాలకు రూ.30 లక్షల మేర వివిధ రూపాల్లో సాయమందించిన డాక్టర్‌ రమాదేవికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ వల్లభనేని బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న డాక్టర్‌ రమాదేవి అభినందనీయులని పేర్కొన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ నారాయణ మాట్లాడుతూ కళాశాల పట్ల, ఆమెకున్న ఆప్యాయతకు, అనురాగానికి ధన్యవాదాలు తెలిపారు. నగరం మండలం సజ్జావారిపాలెంనకు చెందిన రమాదేవి తన ప్రాంతంలోని ఈ కళాశాలకు సాయమందిం చడం ముదావహమని అన్నారు. పరిపాలన అధికారి సుధాకర్‌రావు మాట్లాడుతూ రమాదేవి లాంటి వ్యక్తులు సమాజాభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. అధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్‌ రమాదేవి సేవలు ప్రశంసనీయమని అన్నారు. సన్మాన గ్రహీత డాక్టర్‌ రమాదేవి మాట్లాడుతూ ఈ కళాశాలను ఇంకా అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. కళాశాలకు ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నట్లు తెలిపారు. కళాశాల తెలుగు శాఖాధిపతి లైబ్రరీ శ్రీనివాసరావు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.