Oct 02,2023 20:30

నోటీసు అందుకున్న సింహాచలం

ప్రజాశక్తి -బొబ్బిలిరూరల్‌ :  విజయనగరంజిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో సోమవారం తెల్లవారు జామున 5.30 గంటలకు తూముల సింహాచలం అలియాస్‌ బాస్‌ ఇంటిలో ఎన్‌ఐఎ (హైదరాబాద్‌) పోలీసులు సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాడికల్స్‌ తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. దీనిలోభాగంగా సింహాచలం ఇంటిలో సోదాలు నిర్వహించారు. సింహాచలం గతంలో మావోయిస్టు ప్రజాసంఘంలో సభ్యుడిగాఉన్నారు. అతని ఇంట్లో కొన్ని కర పత్రాలు, పుస్తకాలను, అతని సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకొని సిఆర్‌పిసి 160 కింద నోటీసు జారీ చేసి ఈ నెల 31న హైదరాబాద్‌ ఎన్‌ఐఎ ఆఫీసులో హాజరు కావాలని సూచించారు.