పల్నాడు జిల్లా : ఈనెల 2 న 62 మంది పౌర హక్కుల, ప్రజా సం ఘాల, న్యాయవాదులపై ఎన్.ఐ.ఏ దాడులు దుర్మార్గమని దాడులను ఖండిస్తున్నామని పిడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ లోని ఎన్జీఓ హౌం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైవి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాత్మా గాంధీ జయంతి రోజున ఉదయం 6 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్.ఐ.ఏ అధికారుల పర్యవేక్షణలో రెండు రాష్ట్రాలలో 62 ప్రాంతాల్లో ఏకకాలంలో పథకం ప్రకారం ఈ దాడులు కొనసాగాయన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పిడి ఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి సోదాలు చేసి ఇంటిని సీజ్ చేశారన్నారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో పిడిఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు ఇంటిపై దాడి చేసి ఆయన సెల్ ఫోన్స్ 3, మూడు బ్యాంకు పుస్తకాలు సీజ్ చేశారన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరింప చేసి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందో ళనకు గురి చేశారని పిడిఎం నాయకులను అవవ ూనించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు వెంటనే నిలుపుదల చేసి ఉపా కేసులు ఎత్తివేయాలని, ఎన్‌ఐఎ ను రద్దు చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.










