Nov 19,2022 23:36

తిరుపతి బయలు దేరిన మహిళలతో ముత్యాల వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి
ముత్యాల గ్రూప్‌ ఆఫ్‌ ఇండిస్టీస్‌ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమల తీర్థయాత్రకు ప్రత్యేక బస్‌ ఏర్పాటు చేశారు. ఈ తీర్థయాత్రను శనివారం స్థానిక నరసింగరావుపేట ఎంవిఆర్‌ ట్రస్ట్‌ కార్యాలయం వద్ద వెంకటేశ్వరరావు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల యాత్రకు మొదట ఒక బస్సుతో ప్రారంభమై 50 బస్సుల ద్వారా పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని భక్తులను తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఎంవిఆర్‌ తీర్థయాత్ర బస్సు బయలుదేరుతుందన్నారు.
బుచ్చయ్యపేట : కార్తీక మాసోత్సవాల సందర్భంగా వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో భక్తులకు ఉచిత తీర్థయాత్రలు ఏర్పాటు చేశారు. రాజాం గ్రామం నుండి 53 మంది మహిళలను తమ బస్సులో అన్నవరం, సింహాచలం, బొజ్జన్నకొండకు తీసుకెళ్లారు. వారికి అవసరమైన అల్పాహారం, భోజన ఏర్పాటు చేశారు. ఎంవిఆర్‌కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.