కడప అర్బన్ సిఎం జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నేషనల్ మిషన్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ (ఎంటిఎస్) అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరిని రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. జెఎసి ప్రతినిధులతో చర్చించి ఇచ్చిన జిఒ నంబరు 60 ప్రకారం వేతనాలు, 2022, నవంబర్ నుంచి అరియర్స్ వెంటనే చెల్లించాలని తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఒకే కేడర్, ఒకే జీతం అమలు చేయాలని కోరారు. హెచ్‌ఆర్ పాలసీ,హెల్, జనరల్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఎం-హెచ్‌ఆర్ సెల్ , గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒప్పంద బదిలీలకు అవకాశం కల్పించాలని చెప్పారు. సమస్యలు పరిష్కరించకుంటే దశలవారి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు ఒకటి నుంచి ఏక్షణమైన విధులు బహిష్కరించి నిరవదిక సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య అదనపు అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, ఉద్యోగులు షరీఫ్, సుహాసిని, ఉమాదేవి, షబానజ్మి, లక్ష్మిదేవి, రీతురాణి, సల్మా, సుప్రజ, బేబిరాణి, వైలెట్, అమ్ములమ్మ, సుమత్, సృజన, జీవనజ్యోతి, రమాదేవి పాల్గొన్నారు.










