Aug 25,2023 22:13

ఎంపీతో మాట్లాడుతున్న బాధితులు

ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు: జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి అక్కడ చిక్కుకున్న మండలంలోని మంచినీళ్లపేటకు చెందిన బాధితులు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడును శ్రీకాకుళంలో శుక్రవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంచినీళ్లపేటకు చెందిన పుక్కళ్ల రామ్మూర్తి, కె.నరసింహులు, గణేష్‌, బుంగ సంతోష్‌, ఆర్‌.దానయ్య, సోడిపిల్లి రాకీ, చెక్క ఎర్రన్న తదితర 20 మంది మత్స్యకారులు ఉపాధి కోసం సౌదీ వెళ్లి అక్కడ పనుల్లేక, స్వదేశానికి వచ్చే మార్గం లేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని టిడిపి నాయకులు గోవింద పాపారావు, మంచినీళ్లపేట మాజీ సర్పంచ్‌ గుళ్ల చిన్నారావు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ స్పందించి విదేశాంగ మంత్రిని కలిసి, బాధితులను స్వదేశానికి తీసుకురావడానికి చేసిన కృషి ఫలించడంతో క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు.