ప్రజాశక్తి - వేటపాలెం
మండల నూతన ఎంపీడీవోగా చింతల రూతమ్మ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. కురిచేడు ఎంపీడీవో ఆఫీస్ సూపర్నెంటఖగా పని చేస్తూ పదోన్నతిపై వేటపాలెం ఎంపీడీవోగా వచ్చినట్లు ఆమె విలేకరులకు తెలిపారు. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్న తనని నేరుగా కలిస్తే తన పరిధిలోని సమస్యలను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తాను ఇక్కడ యుడిసిగా, సూపర్నెంట్‌గా పనిచేసి అనుభవం ఉందన్నారు. ఇప్పుడు ఎంపీడీవోగా ఉద్యోగ ఉన్నత మీద రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముందుగా ఇన్చార్జి ఎంపీడీవో నేతాజీ, సూపర్నెంట్ ఎంవిఎస్ శర్మ, యుడిసి జయరాజులు ఆమెకు బొకె అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రుతమ్మ భర్త సత్యం, పాస్టర్, ఆమె కుమార్తెలు, జూనియర్ అసిస్టెంట్ నాన్సీ సౌజన్య, పందిళ్లపల్లి, దేశాయిపేట పంచాయతీ కార్యదర్శులు శారద, శ్రీనివాసరావు పాల్గొన్నారు.










