Mar 23,2023 23:58
ఎంపీడీవోను సన్మానిస్తున్న ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు

ప్రజాశక్తి-బాపట్ల: గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణతో జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కృషి చేసిన ఐటీసీ సంస్థ అవార్డులు ప్రకటించింది. గురువారం నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఉత్తమ అధికారిగా బాపట్ల ఎంపీడీవో రాధాకృష్ణకు అవార్డు అందజేశారు. ఐటీసీ అవార్డు అందుకున్న ఎంపీడీవో రాధాకృష్ణను బాపట్ల ఎంపీపీ చిన్న పోతుల హరిబాబు పలువురు ఎంపీటీసీలు మండల పరిషత్‌ కార్యాలయంలో సన్మానించారు. అదేవిధంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం అవార్డు గ్రహీతలైన మూల పాలెం గ్రామ సర్పంచ్‌ బొలిమేర అనిల్‌ కుమార్‌, ముత్తాయపాలెం పంచాయతీ కార్యదర్శి ఝాన్సీలక్ష్మి, అప్పికట్ల ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ వెంకట్‌ కుమార్‌, భర్తిపూడి వాలంటీర్‌ రాజేష్‌, ఈస్ట్‌ బాపట్ల క్లాప్‌మిత్ర కృష్ణబాబులను సన్మానించారు. కార్యక్రమంలో ఇఓఆర్‌డి పులి శరత్‌ బాబు, కార్యాలయ పాలనాధికారి రజని, సిబ్బంది పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.