ప్రజాశక్తి మడకశిర రూరల్ : మడకశిర మండలంలోని సర్పంచులు స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రతి పంచాయతీలోనూ 10 లక్షలు పైగా డబ్బులు పంచాయతీకి ఖర్చు పెట్టామని ఇంతవరకు నిధులు రాకపోవటంతో తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సర్పంచులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ సమావేవాన్ని బారుకాట్ చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈసందర్బంగా వారు నిధులు లేకపోవటంతో పంచాయతీలను ఎలా అభివృద్ధి చేయాలని ఎంపీడీవో సోనీ బారుతో వాగ్వాదానికి దిగారు. వెంటనే 14, 15 ఆర్థిక నిధులు విడుదల చేయాలని సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీరు, డ్రయినేజీ సమస్యలను కూడా పరిష్కరించలేకుండా ఉన్నామని వాపోయారు. సర్పంచుల కు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచిలు గీతమ్మ, రంగనాథ్, కరయన్న తదితరులు పాల్గొన్నారు.










