Oct 27,2023 00:10

ప్రజాశక్తి - రేపల్లె
ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు చొరవతో పేటేరు గ్రామంలో అభివృద్ధి పనులు జరిగినట్లు పేటేరు వైసిపి ఇంచార్జ్ కనపర్తి రవికిరణ్ గుర్తు చేశారు. గ్రామానికి మంజూరైన రూ.5లక్షల ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో 8వ వార్డులో సీసీ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. వైస్ ఎంపీపీ రావు ప్రభాకరరావు సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ పేటేరు పంచాయతీ అభివృద్ధికి ఎంపి మోపిదేవి వెంకటరమణరావు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గ్రామంలో ఇప్పటికే పలు సిసి రోడ్లు, సచివాలయ భవనాలు, పంచాయితీ కార్యాలయ భవనం నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం 70మీటర్లు పొడవు అంచనాలతో సీసీ రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిభిరం ఈనెల 28న జరుగుతుందన్నారు. ఈ సచివాలయ పరిధిలోని ప్రజలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.