
ప్రజాశక్తి-పొదిలి : కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామంలో బుధవారం గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి చిన్నారికట్ల వెళ్తూ మార్గమధ్యలో పొదిలిలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి స్వగహానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు. కార్యకర్తలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మర్రిపూడి ఎంపిపి వాకా వెంకట రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాస రెడ్డి, జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, పొదిలి ఎఎంసి మాజీ చైర్మన్ గుజ్జుల రమణా రెడ్డి, గూడూరి వినోద్ కుమార్, ఉలవాగోపి పాల్గొన్నారు.