ఎంపిడివో కార్యాలయం ఆకస్మిక తనిఖీ
పజాశక్తి కార్వేటినగరం : కార్వేటినగరం లో ఎంపిడిఓ కార్యాలయన్ని బుధవారం జడ్పిసిఈవొ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన ఆఫీస్ నందు పలు రికార్డులను, రిజిస్టర్ లను పరిశీలించి,''జగనన్నకు చెబుదాం, స్వచ్ఛత హీ సేవా, జగనన్న ఆరోగ్య సురక్షా పథకం ''లపై సమీక్ష నిర్వహించి, సదరు ప్రోగ్రాము లను పటిష్టంగా అమలు పరచాలని సూచించి, జడ్పీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సమావేశపు భవనమును పరిశీలించి, పెండింగ్ లో వున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, ఎంపిడిఓ ను ఆదేశించిన.అదే విధంగా సచివాలయ సిబ్బంది విధి నిర్వహణ లో సమయపాలన పాటించాలని, లేనిపక్షం లో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు సకాలంలో అందించాలని తెలిపారు.జడ్పిసిఈవొతో పాటు కార్వేటినగరం ఎంపిడిఓ మోహన మురళి, సిబ్బంది ఉన్నారు.










