ఎంజీఎంలో విజయవంతంగా జీఓఏ సర్జరీ
ఎంజీఎంలో విజయవంతంగా జీఓఏ సర్జరీ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: పట్టణంలోని స్థానిక ఎంజీఎం హాస్పిటల్లో అరుదైన గ్యాస్ట్రిక్ అవుట్ లెట్ అబ్స్ట్రక్షన్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్ర చికిత్సను విజయ వంతంగా పూర్తి చేసి ప్రాణాలు కాపాడారు. కేవీబీపురం మండలానికి చెందిన బాబు తీవ్రమైన కడుపు నొప్పితో ఈ నెల 8న ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. రోగికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. గుండె వైద్య నిపుణులు వివేక్ చైతన్య పర్యవేక్షణలో డాక్టర్ శివకిషోర్ అరుదైన గ్యాస్ట్రిక్ అవుట్ లెట్ అబ్స్ట్రక్షన్ ఆపరేషన్ పూర్తి చేసి ప్రాణాలను కాపాడారు. అరుదైన శస్త్ర చికిత్సను విజయ వంతంగా పూర్తి చేసి రోగి ప్రాణాలు కాపాడిన వైద్య బందాన్ని ఎంజీఎం డైరెక్టర్ గుడ










