ఎంఇఒలు, హెచ్‌ఎంలతో రివ్యూ మీటింగ్
ప్రజాశక్తి-కావలి రూరల్ : కావలి డివిజన్ పరిధిలోని 18 మండలాలకు సంబంధించిన ఎంఇఒలు, హెడ్ మాస్టర్స్‌లతో శుక్రవారం శ్రీ చైతన్య స్కూలలో కావలి ఎంఇఒలు గోవిందయ్య-1, వెంకటసుబ్బయ్య-2 ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఒ) ఆర్‌ఎస్ గంగాభవాని పాల్గొని మాట్లాడుతూ పాఠశాలల్లో రైసాలైజేషన్, నాడు-నేడు, పనులు ట్యాబ్‌లు, ఎఫ్‌ఎ2 ఎగ్జామ్స్, టీచర్స్ వర్క్ అడ్జస్ట్మెంట్స్, జిఇఆర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్‌ప్రకాష్ విద్యార్థులకు చేస్తున్న వీడియో కాల్స్, మొదలైన విద్యా విషయాల మీద రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పథకాలు పాఠశాలకు ఉపయోగపడే విధంగా చూడాలని ఎంఇఒలు వర్క్ అడ్జస్ట్మెంట్‌పై పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు టీచర్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఇఒ రఘునాథయ్య, డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.










