ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ఉపాధ్యాయ వత్తి గౌరవ ప్రదమైందని మండల విద్యాశాఖ అధికారి సన్నపురెడ్డి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా అవార్డు అందుకున్న ఎంఇఒ వేణుగోపాల్ రెడ్డికి మండలంలోని సౌత్ ఆములూరు ప్రాధమికోన్నత పాఠశాలలో చిన్న చెరుకూరు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు బుధవారం సన్మానించారు. హెచ్‌ఎం అహ్మద్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయ వత్తి గౌరవ ప్రాథమైందే కాకుండా బాధ్యతాయుతమైదని తెలిపారు. మండల ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసనాయుడు, హెచ్‌ఎం అహ్మద్ బాషా మాట్లాడారు. వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సయ్యద్ ఖాదర్ బాషా, కాంప్లెక్స్ లోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవార్డుగ్రహీత వేణుగోపాల్ రెడ్డిని శ్రీనివాస నాయుడు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మా నించారు. సౌత్ ఆములూరు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి.










