ప్రజాశక్తి-చీరాల: మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్‌పి) బాపట్ల జిల్లా కన్వీనర్‌గా బుడంగుట్ల లక్ష్మీనరసయ్య మాదిగను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఆదివారం అధికారంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చీరాల నియోజకవర్గ మాదిగ ఉద్యోగులు మరియు ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ అనుబంధ సంస్థల నాయకులు బుడంకుంట్ల లక్ష్మీ నరసయ్యకు అభినందనలు తెలిపారు. స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాలు మాదిగ, జాతీయ కార్యదర్శి సర్వేపల్లి రవి రాజుమాదిగ పాల్గొని నియామక పత్రాన్ని అందిస్తూ ఆభినంనలు తెలిపారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ మహాజన సోషలిస్ట్ పార్టీని బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ఆదరణను కోరి ప్రజా పక్షపాతిగా పనిచేసి ఎంఎస్‌పి సిద్ధాంతాలను అమలు చేసేందుకు నిర్విరామంగా కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పట్ల జాతి సమస్యల పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులు బుడంగుట్ల లక్ష్మీనరసయ్య మాదిగను బాపట్ల జిల్లా ఎంఎస్‌పి కన్వీనర్‌గా నియమించినందులకు వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగకు కతజ్ఞతలు తెలుపుతూ కన్వీనర్ బుడంగుట్ల లక్ష్మీనరసయ్యమాదిగకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోహార్ మాదిగ, నాగరాజు మాదిగ, శ్యామ్ మాదిగ, అవినాష్, రాంబాబు, సాయి, మరియు మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా నాయకులు రమేష్ పాల్గొన్నారు.










