ప్రజాశక్తి-కాకినాడ ఎంఎస్‌ఎన్ పీజీ సెంటర్‌ను అభివద్ధి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు నన్నయ యూనివర్సిటీ విసి పద్మరాజుకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి జి. దినేష్ కుమార్ పీజీ సెంటర్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమ్యసలు పరిష్కరించి సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.వరహాలు, సాయిత్, తేజ పాల్గొన్నారు.










