Sep 29,2023 22:23

వ్యవసాయ కళాశాలలో నివాళి అర్పిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది

ఎంఎస్‌ స్వామినాథన్‌కు నివాళి
ప్రజాశక్తి - క్యాంపస్‌
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నివాళి అర్పించారు. డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ పి.సుధాకర్‌, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి.ప్రభాకర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు డాక్టర్‌ పివి సత్యగోపాల్‌ సంతాపసభలో పాల్గొన్నారు. డీన్‌ పి.సుధాకర్‌ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల వృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించేందుకు విశేష కృషి చేసి, దేశం ఆకలి తీర్చిన మహనీయుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ అన్నారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్‌ కీలక పాత్ర పోషించారన్నారు. హరిత విప్లవ పితామహుడుగా ఎంఎస్‌ స్వామినాథన్‌తో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని అన్నారు. అసోసియేట్‌ డీన్‌ జి.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ చెన్నరులో ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చి ఫౌండేషన్‌ ద్వారా వ్యవసాయంలో వరి, గోధుమ నూతన వంగడాల ఆవిష్కరణలో ఆయన చేసిన కృషిని వివరించారు. 2001, జనవరి 15న తిరుపతి వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన మిలీనియం లెక్చర్‌ కోసం ఆయన కళాశాలను సందర్శించారని, ఆయన ప్రసంగం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
నూతన వంగడాల సృష్టికర్త : అబ్దుల్‌ సుభాన్‌
ప్రజాశక్తి - బంగారు పాళ్యం
నూతన వంగడాల సష్టికర్త స్వామినాథన్‌ అని ప్రధానోపాధ్యాయులు అబ్దుల్‌ సుభాన్‌ అన్నారు .శుక్రవారం మండలంలోని టేకు మంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వామినాథన్‌ మృతికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ సుభాన్‌ మాట్లాడుతూ భారతదేశ హరితవిప్లవ పితామహుడు గా పేరుగాంచిన ఎమ్‌ ఎస్‌ స్వామినాథన్‌ మృతి భారతదేశానికి తీరనిలోటని. వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి వ్యవసాయ అభివద్ధి కోసం పనిచేసిన శాస్త్రవేత్తని. వారి కషి ఫలితంగానే దేశం హరితవిప్లవాన్ని అమలుచేసుకొని ఆహారఉత్పత్తుల్ని పెంచుకోగలిగిందనీ అన్నారు. బంగాళా దుంపలు, గోధుమలు, వరి మొదలగు ఆహారపంటల్లో కొత్త వంగడాలు,రసాయన ఎరువుల వాడకం ద్వారా మనదేశం స్వయం సమద్ధి దిశగా పయనిస్తుందన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షంషేర్‌ ఖాన్‌, వేణురెడ్డి, వెంకటస్వామి, వెంకటరమణ, కేశవులు, జయప్రకాష, అన్నపూర్ణాదేవి, శుభలక్ష్మి పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాలలో నివాళి అర్పిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది