Jul 03,2023 21:56

ఫొటో : మాట్లాడుతున్న కావలి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు

ఎంఎల్‌ఎపై మాలేపాటి మండిపాటు
ప్రజాశక్తి-అల్లూరు : కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిపై టిడిపి కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు తీవ్రస్థాయిలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మండల కేంద్రం స్థానిక టిడిపి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముందుగా పోలేరమ్మ దేవస్థానంలో ఉదయగిరి మాజీ ఎంఎల్‌ఎ కంభం విజయరామిరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రకోట, బోగోలులో పట్టపగలే గ్రావెల్‌ తరలిస్తూ ఉంటే ఎంఎల్‌ఎకు సిగ్గు ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ ప్రభుత్వంలో దోపిడీలు దౌర్జన్యాలు అధికంగా ఉన్నాయన్నారు. 7న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగలం పాదయాత్ర అల్లూరు మండలంలోకి వస్తున్నట్లు తెలియజేశారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాను కార్యకర్తల వెన్నంటే ఉంటానని ఇప్పటికే 27 కేసులు తనపై అధికార పార్టీ నాయకులు పెట్టించినట్లు కార్యకర్తలకు వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి బీద గిరిధర్‌, అరగల రమణయ్య, బండి శ్రీనివాసులరెడ్డి, బుల్లా కృష్ణారెడ్డి, రామిశెట్టి కృష్ణ చైతన్య తదితరులున్నారు.