Sep 17,2023 19:12

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
   కొయ్యలగూడెంలో షాపు ఓపెనింగ్‌ వచ్చిన పోలవరం నియోజకవర్గం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజును సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు కలసి వినతిని సమర్పించారు. భవన నిర్మాణ కార్మికుల చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అసెంబ్లీలో మాట్లాడి సిఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. 30 లక్షల మంది కార్మికుల హక్కులు, చట్టాలను అమలు చేసి ఆదుకోవాలన్నారు. ఆయన స్పందిస్తూ అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికుల విషయంపై మాట్లాడి, సిఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.