Aug 16,2023 22:13

ఫొటో : ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డికి వినతి
ప్రజాశక్తి-ఉదయగిరి ; ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డికి ఉదయగిరి జిల్లా సాధన కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. బుధవారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టరు వేణుగోపాల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ దస్తగిరి అహ్మద్‌, ఉపాధ్యక్షులు గాజులపల్లి రామిరెడ్డి, కార్యదర్శి షేక్‌ ఖాదర్‌ బాషా, కమిటీ సభ్యులు ఉదయగిరి జిల్లా సాధన అవసరాన్ని గురించి ఆయనకు వివరించి వారికి మెమోరాండం చేసి ఉదయగిరి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకుని పోవాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గం మూడు జిల్లా కేంద్రాలైన నెల్లూరు, కడప, ఒంగోలుకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఉదయగిరి జిల్లా ఏర్పాటు ఒక్కటే పరిష్కారమన్నారు. జిల్లా ఏర్పడితే 33 కార్యాలయాలు సంభందించిన పరిపాలన జరుగుతుందని, తద్వారా విద్య వైద్యం, ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన తాను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.