ప్రజాశక్తి-ఏలేశ్వరం ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత ప్రసాద్ వల్ల వైసిపి తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తోందని మాజీ ఎంఎల్‌ఎ వరుపుల సుబ్బారావు అన్నారు. మండలంలోని మర్రివీడు గ్రామంలో వైసిపి నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో బుధవారం ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని అవినీతి ప్రస్తుత ఎంఎల్‌ఎ పర్వత హయాంలో చోటు చేసుకుందన్నారు. ఏలేశ్వరం ఎంపిపి గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా ఎంఎల్‌ఎ పర్వత ప్రసాద్ చేసిన అవినీతి చిట్టా ప్రజలకు వివరించి ఆయనకు టికెట్ రాకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఎంపిపి గంగుమళ్ల వెంకటలక్ష్మి, వైసిపి సీనియర్ నాయకులు వాసిరెడ్డి జమీలు, పలువురు ఎంపిటిసిలు, సర్పంచులు ఉన్నారు.










