Sep 30,2023 20:30

పరామర్శిస్తున్న ఎంఎల్‌ఎ

పరామర్శిస్తున్న ఎంఎల్‌ఎ
ఎంఎల్‌ఎ మేకపాటి పరామర్శ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డు కౌన్సిల్‌ కొండా యుగలక్ష్మి ఇటివల మతి చెందడంతో వారి కుటుంబసభ్యులను శనివారం ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి పరామర్శించారు.12వ వార్డులోని కౌన్సిలర్‌ కొండా యుగలక్ష్మి భర్త, వైసిపి నాయకులు కొండా వెంకటేశ్వర్లు నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కౌన్సిలర్‌ మతి చెందడం బాధాకరమని, అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.