ప్రజాశక్తి - అద్దంకి
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పట్టణంలో టిడిపి నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కాగడాల నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 41నోటీసులు అందజేశారు. నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి లేదని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల డిఎస్పి ప్రసాదరావు ఆదేశాల మేరకు సిఐ బి రమేష్ బాబు ఎంఎల్‌ఎను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.










