Sep 02,2023 21:53

ప్రజాశక్తి - ముదినేపల్లి
     ముదినేపల్లిలోని గురజ రోడ్డులో ఏర్పడ్డ గుంతలను ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌ చొరవతో శనివారం పూడ్చివేశారు. గురజ రోడ్డు మలుపు నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు అత్యంత ప్రమాదకరంగా రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. వర్షానికి ఈ గుంతల్లో నీరు చేరి రోడ్డు కనబడక ద్విచక్ర వాహనదారులు, ప్రజలు నానా యాతన పడుతున్నారు. నిత్యం అనేకమంది ఈ గుంతల్లో పడి క్షతగాత్రులుగా మారుతున్నారు. విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు ఈ రోడ్డులో ప్రయాణించాలంటే హడలిపోతున్నారు. ఈ రోడ్డు దుస్థితి విషయం ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే గుంతలు పూడ్చేందుకు చొరవ చూపారు. ఈ పనులను ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, గ్రామ సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ, వైసిపి నాయకులు పర్యవేక్షించారు.