ప్రజాశక్తి - వేటపాలెం
మండలంలోని కొత్తపేటకు చెందిన ఆనాల ఆది వెంకటలక్ష్మి సాయిరాం అనే మహిళకు ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో గోల్డ్ మెడల్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 వార్షిక స్నాతకోత్సవ సందర్భంగా మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో పూర్వ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ నజీర్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ప్రత్యేక సంపాదకులు పాలగుమ్మి సాయినాథ్, ఆచార్య గణేషన్ కన్నాభిరాన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, యూనివర్సిటీ ఆచార్య రాజశేఖర్ పట్టేటి వంటి మహారధుల చేతుల మీదుగా అందుకున్నారు. గోల్డ్‌మెడ్ అందుకున్న ఆదివెంటలక్ష్మిని కుటుంబ సభ్యులు అభినందించారు.










