ప్రజాశక్తి - సీతానగరం : మండలంలో వర్షాల్లేక ఎండిపోతున్న వరి పంటను స్థానిక తహవీల్దార్ ఎంవి రమణ, మండల వ్యవసాయాధికారి ఎస్.అవినాస్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ మండలంలో 6 గ్రామాల్లో వర్షధారంపై ఆధార పడి వరి చేలు ఈ రకమైన ఎండిపోతున్నాయన్నారు. వరి పంట నష్టం ప్రాథమిక అంచనా జిల్లాకు అందజేస్తామన్నారు. ఎఒ మాట్లాడుతూ వర్షం పడక లేదా తేమ లేని వరి పంటలకు ఎకరాకు 2కేజీ లు 19:19:19 లేదా 13:0:45 లేదా మల్టీకె వంటి రసాయనాలు పిచికారీ చేసుకోవాలన్నారు. లీటర్ నీటికి 5మిల్లీలీటర్లు కలుపుకొని 14 నుండి 16 ట్యాంక్ లు పిచికారీ చేయాలన్నారు. అలా చేయడం వల్ల వారం నుండి పది రోజులు వరకు తేమ ఉండి మొక్కలు వాడిపోకుండా నివారించవచ్చునని తెలిపారు. అలాగే పూర్తిగా వాడి పోయిన వరి పంట నివేదిక పైఅధికారులకు పంపిస్తామని ఇప్పటి వరకు నిడగళ్లు, కోట సీతారాంపురం, వెన్నెల బుచ్చంపేట, సూరంపేట, పెదభోగిలిలో ఎద పంటలు 56 ఎకరాల వరకు సుమారుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయన తో పాటు రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.










