Jul 12,2023 23:39

వినతిపత్రం ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఏడీ రవిబాబుకి ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. విలీనం పేరుతో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, 9, 10 తరగతులకు వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు కేటాయించి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షలు కె.ప్రసన్న, ఉపాధ్యక్షలు శ్రీదేవి, షేక్‌ బీబీ, ఎస్‌,అమ్మాజీ, బి.ఉమ, పార్వతి, సహాయ కార్యదర్శులు అమ్మాజీ, సత్యసాయి, బి.లక్ష్మి, రమణమ్మ, కె,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.