కాలం మారుతున్న ప్రకారం తీసుకునే పదార్థాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో తినాల్సిన ఆహారపదార్థాలంటూ కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటూ ఉంటే ఆరోగ్య సమస్యలు దాదాపుగా దరిచేరవు. అలాంటి పదార్థాలు ఏమిటో చూద్దాం.
* వేసవిలో ప్రధానంగా బాధించేది డీహైడ్రేషన్. నీళ్లు ్ల్లఎక్కువగా తీసుకున్నప్పటికీ కాఫీ, టీల మోతాదును తగ్గించుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటిశాతం తగ్గి, డీహైడ్రేషన్ ఎదురుకావచ్చు. శరీరం కూడా తేమని కోల్పోయి, నిర్జీవంగా మారుతుంది.
* నూనెలో వేగించిన ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి వెళ్లకూడదు. లేదంటే వికారం, అతిగా దాహం వేయడం వంటివి తప్పవు.
* ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలావరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి, జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి.
* వేసవిలో అందుబాటులో ఉండే పుచ్చకాయను అస్సలు మిస్ కావద్దు. ఇందులో 91.45 శాతం నీరే ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అవసరమైన నీరు చేరుతుంది. అంతేగాక పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సైడులూ శరీరానికి అందుతాయి. శరీరాన్ని ఎప్పుడూ కూల్‌గా ఉంచుతాయి.
* ఉల్లిపాయలూ రరశరీరానికి చలవ చేస్తాయి. ఔను, ఉల్లిపాయలు చలవే. వీటిని పచ్చిగా తింటే మంచిది. ఒకవేళ నేరుగా తినడం ఇష్టం లేకపోతే రైతా లేదా నిమ్మకాయ, కాస్త ఉప్పు చల్లి తినవచ్చు. మంచి టేస్టుగా ఉంటాయి. ఉల్లిపాయ వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.
* మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్.... వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్నీ పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్ధకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
* జంక్‌ఫుడ్ ఈ కాలంలో మంచిది కాదు. ఇందులో అధిక కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.