ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అగ్రగామి 'ఆర్‌సిఆర్'
నాణ్యమైన విద్యా బోధన,అడ్మిషన్లలో ముందంజ
సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులచే బోధన
వర్సిటీ పరిధిలో ప్రతి సెమిస్టర్‌లో అత్యుత్తమ ఫలితాలు
ఆహ్లాదకరమైన వాతావరణంలో తరగతులు
ప్రతిఏటా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు
ప్రజాశక్తి - క్యాంపస్
తిరుపతి జిల్లా కరకంబాడి రోడ్డులోని ఆర్‌సిఆర్ కళాశాల మేనేజ్మెంట్ కోర్సులకు అగ్రగామిగా గత 15 సంవత్సరాలుగా వెలుగొందుతోందని కళాశాల డైరెక్టర్ వి. రవికుమార్ చౌదరి పేర్కొన్నారు. 'ప్రజాశక్తి' తో ఆయన మాట్లాడుతూ విద్యాహబ్‌గా విరాజిల్లుతున్న కరకంబాడి రోడ్డులో ఆర్‌సిఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో 180 సీట్లు, ఎంసీఏ కోర్సులో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ విద్యార్థులకు మానవతా విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యను, నాణ్యమైన శిక్షణ, సుశిక్షితులైన, సబ్జెక్టు నిపుణులైన అధ్యాపకులచే బోధన తరగతులు అందించబడతాయన్నారు. ఆర్ సి ఆర్ కళాశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిందని, నూతన డిజిటల్ తరగతి గదులు, అత్యాధునిక పరికరాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇతర ల్యాబొరేటరీ వంటి సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయనీ వెల్లడించారు. కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేకమైన సెమినార్ హాలు, డిజిటల్ లైబ్రరీ, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐఐటి లోని సీనియర్ అధ్యాపకులచే కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ రిలయన్స్ వంటి అంశాల పైన ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడుతుందని, క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా తమ కళాశాలకు వస్తున్నాయని వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రతి సెమిస్టర్ నిర్వహించే పరీక్షల ఫలితాలలో, మేనేజ్మెంట్ మీట్ వంటి పోటీలలో ఆర్సిఆర్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు. ఎంబీఏ విద్యార్థులకు అకాడమిక్ అంశాలతోపాటు ప్రత్యేకంగా గ్రూప్ డిస్కషన్స్, సెమినార్, మేనేజ్మెంట్ గేమ్స్, రియల్ కేస్ స్టడీస్, శాప్, తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఎంసీఏ విద్యార్థులకు కళాశాలలో ప్రత్యేకంగా బిగ్ డేటా అనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాట్ నెట్ టెక్నాలజీస్, ఇంటర్ నెట్ ఆఫ్ ధింగ్స్ సబ్జెక్టులతో పాటు అధునాతన ప్రోగ్రామింగ్ కోర్సులైన సి, సి ంం , జావా, ఒరాకిల్, పైతాన్, పి హెచ్ పి, డాట్ నెట్ లలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కళాశాలలో మేనేజ్మెంట్ కోర్సులో చేరిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచే ఉన్నతమైన కంపెనీలలో ఉన్నతమైన స్థానాలను (జాబ్ లను) అలంకరిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ... మేనేజ్మెంట్ కోర్సులో చేరాలనుకునే ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ కళాశాలను ఎంచుకోవడం ద్వారా నాణ్యమైన విద్య మీకు అందించబడుతుందని తెలిపారు.
కళాశాల భవనం










