ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని సిపిఎం నాయకులు సి.గోవిందు, బి.రాముడు, రైతుసంఘం నాయకులు అబ్దుల్లా, సుభాన్ డిమాండ్ చేశారు. సోమవారం 'స్పందన'లో తహశీల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం, రైతు సంఘాల నాయకులు గోవిందు, రాముడు, అబ్దుల్లా, సుభాన్ మాట్లాడారు. ఎమ్మిగనూరు మండలాన్ని కరువుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాభావం వల్ల మండలంలో రైతులు తీవ్రంగా నష్టం పోయారని పేర్కొన్నారు. మండలంలో ఎల్‌ఎల్‌సి ఆయకట్టు కింద నీరందక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేశారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల పెట్టుబడి రాక రైతుల అప్పుల పాలయ్యారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు, పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి చివరి దాకా ఎల్‌ఎల్‌సి నీరందించాలి కోరారు. రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌలుదారులకు కౌలు రద్దు చేసి వారికి కూడా నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. రైతులు రాజు, బాష, రమేష్ పాల్గొన్నారు.
వినతిపత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు










