Mar 21,2023 18:57

మాట్లాడుతున్న రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ

ఎమ్మెల్యేలపై దాడులు చేయడం సిగ్గుచేటు : టిడిపి
ప్రజాశక్తి-డోన్‌

టిడిపి ఎమ్మెల్యేలపై వైసిపి ఎమ్మెల్యేలు దాడి చేయడం హేయమైన చర్య అని టిడిపి నాయకులు అన్నారు. డోన్‌ పట్టణంలో టిడిపి కార్యాల యం నందు డోన్‌ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, డోన్‌ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్‌ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ మాట్లాడుతూ టిడిప ఎమ్మెల్యేలు డోలా వీరాంజనేయస్వామి, బుచ్చయ్య చౌదరిల పట్ల వైసిపి ఎమ్మెల్యేలు ప్రవర్తిం చిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్‌ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున,సింగిల్‌ విండో డైరెక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి,తెలుగుయువత కమిటీ నాయకులు ప్రవీణ్‌ రెడ్డి,ఉడుములపాడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు : అసెంబ్లీ సాక్షిగా టిడిపి ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడం సిగ్గుచేటని కొత్తపల్లి మండల టిడిపి నాయకులు కెవి శివారెడ్డి చిన్న పుల్లారెడ్డి నాగ శేషన్న అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడకుండా టిడిపి ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడం సిగ్గుచేటైన విషయం అన్నారు. అధికార పార్టీ అసెంబ్లీని కేవలం టిడిపి ఎమ్మెల్యేలను నాయకులను తిట్టడం కోసమే ఏర్పాటు చేసుకుంది అన్నారు. టిడిపి నాయకులు నాయక్‌, శంకర్‌ ఉన్నారు.
- ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, టిడిపి నాయకులు జెట్టి వేణుగోపాల్‌, అబ్దుల్లాపురం బాష, శివప్రసాద్‌ రెడ్డి, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామ్మూర్తి, షఫీ ఉల్లా, ఫక్రుద్దీన్‌, సతీష్‌, రమేష్‌ గౌడ్‌, సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.