Sep 20,2023 23:04

ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చి సమస్యలు చెబుతున్న నాయకులు

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతు ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి భవన నిర్మాణ కార్మికులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎ.ప్రసాదరావు, సిలార్‌ మసూద్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నంబర్‌ 1214ను రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభిం చాలని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. ఇందు కు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, కృష్ణ నాయక్‌, శ్రీకాంత్‌, కె.సాయి పాల్గొన్నారు.