ఎమ్మెల్యే వేంకటే గౌడను నిలదీత
జనసేన మండల
కార్యదర్శి పై దాడి
ప్రజాశక్తి -బైరెడ్డిపల్లి: పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేంకటే గౌడకు గడప గడపలో చేదు అనుభవం ఎదురైంది. బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లిలో, సంక్షేమ పథకాల జాబితాలో మంజూరు చేసినట్లు చూపిన ఇంటిస్థలాన్ని చూపాలని జనసేన నాయకుడు మధుసూదన్ నిలదీశారు. ఇష్టానుసారం ఇంటి స్థలాలను అమ్మేసుకున్నారని ఇంటి స్థలం చూపించాల్సిందే అని మధు కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే వేంకటే గౌడ వెళ్లిపోయారు. అనంతరం మధు కుటుంబ సభ్యులపై పోలీసుల సాక్షిగా వైసీపీ నాయకులు దాడి చేశారు.
మధుసూదన్ తలకు బలమైన గాయాలు కావడంతో బైరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి వద్దకు భారీగా జనసేన కార్యకర్తలు
అనంతరం పరిస్థితి అందోళనకరంగా ఉండడంతో వైద్యులు పలమనేరు ఏరియా ఆసుపత్రికి108 వాహన సహాయంతో తరలించారు. బాధితుడి నుండి పోలీసులు వివరాలు సేకరించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్ ను జనసేన జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్, బైరెడ్డిపల్లి మండలాధ్యక్షుడు కిషోర్ గౌడ తదితరులు పరామర్శించారు.










