ఎమ్మెల్యే సొంత నిధులతో బస్ షెల్టర్ నిర్మాణం
- ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డి తనయుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ప్రయాణికుల సౌకర్యార్థం సొంత నిధులు రూ. 7 లక్షలతో నూతన బస్ షెల్టర్‌ను నిర్మించారు. ఈ బస్ షెల్టర్‌ను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామున్, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన తండ్రి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి 27 సంవత్సరాల క్రితం నంద్యాల పట్టణంలో శిల్పా సేవా సమితిని స్థాపించి నియోజకవర్గ ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. శిల్పా సేవా సమితి ద్వారా నంద్యాల నియోజకవర్గంలో శిల్పాసహకార్, శిల్ప మహిళా బ్యాంక్, శిల్పా స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్, శిల్పా మినరల్ వాటర్ ఇలా అలాగే అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పామ్ షావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










