Nov 21,2022 00:04

ఎమ్మెల్యే పాల్గుణను సన్మానిస్తున్న బిసి, మైనారటీ సంఘం నేతలు

ప్రజాశక్తి-అరకులోయ:అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణకు అల్లూరి జిల్లా బీసీ మైనారిటీ సంఘం నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో పద్మాపురంలోని ఉద్యానవన కేంద్రంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు కాపు గంటి కృష్ణారావు, గౌరవ అధ్యక్షులు మయూరి రాజారావు, బిసి మైనారిటీ సంఘాల ప్రతినిధులు గడ్డం నర్సింగరావు, మురళి పట్నాయక్‌, ఎస్‌కే యాసిన్‌, ఎం.బుజ్జి, కడలి శివ, దివ్య, పట్నాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.