ఎమ్మెల్యే ను విమర్శించే స్థాయి హరిచంద్రా రెడ్డికి లేదు:వైసిపి
ప్రజాశక్తి- పిచ్చాటూరు(తిరుపతి): ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను విమర్శించే స్థాయి వైసిపి మాజీ అధ్యక్షులు హరిచంద్రా రెడ్డికి లేదని వైసిపి మండల అధ్యక్షులు చలపతి రాజు అన్నారు. తిరుపతి జిల్లా సత్య వేడు నియోజకవర్గం లోని పిచ్చాటూరు మండలంలో విలేకరుల సమావేశంలో వైసిపి మండల అధ్యక్షుడు చలపతి రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. అనేక పత్రికల్లో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై, పార్టీ అధ్యక్షుడు మార్పుపై, ఎంపీటీసీ రెబెల్ అభ్యర్థి పై వచ్చిన కథనంపై స్పందించిన వైసీపీ నాయకులు మండల అధ్యక్షుల భనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆది మూలాన్ని విమర్శించే స్థాయి నీకు లేదంటూ వైసిపి మాజీ అధ్యక్షుడు కే హరిచంద్ర రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. పార్టీలో ఎప్పుడు చేరామని కాదని చేరిన తర్వాత పార్టీ కోసమో సంపూర్ణంగా కష్టపడుతూ పార్టీ బలోపేతానికి కషి చేస్తున్న తనను వైసిపి అధిష్టానం పీకే కమిటీ అందించిన సమాచారం మేరకే మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిందన్నారు. రాష్ట్ర పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయానికి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. పిచ్చాటూరు ఎంపీటీసీ ఓడిపోయిన రెబెల్ అభ్యర్థి భర్త సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన మొదటి రోజే వైసిపి జెండాను పట్టిన కార్యకర్తను ఆరోజు తన ప్రయాణం నా స్నేహితులతో కలిసి పార్టీలో చురుకుగా పాల్గొంటూ తన వంతు పార్టీ కోసం బలోపేతం కోసం నిరంతరం కష్టపడిన వాడినని, అటువంటి సమయంలో స్థానిక ఎన్నికలు ప్రకటించడంతో ఎంతో కాలంగా ఎదురుచూసిన తన ఆశయం ఫలిస్తుందని పిచ్చాటూరు సెగ్మెంట్ లో ఎంపీటీసీగా పోటీ చేయాలని భావించానని,నా ఎంపిటిసి విషయమై మండల స్థాయి పార్టీ నాయకులతో చర్చించిన ఎవరు పట్టించక పోవడంతో పార్టీకి వ్యతిరేకంగా కాకుండా సొంతంగానే ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయానని తెలిపారు. అయినా నేను ఎప్పటికీ వైసిపి కార్యకర్తగా ఉంటానే గాని ద్రోహం అయితే చేయనన్నారు. తనపై నమ్మకంతో నామినేట్ పదవుల్లో అయిన మార్కెట్ యార్డ్ మెంబరుగా గుర్తించి ఇచ్చారన్నారు. అంతేకానీ ఇక్కడ ఇటువంటి రాజకీయం జరగలేదు. వైసిపి ఎంపీపీ భర్త నాగభూషణం మోహన్ మాట్లాడుతూ తనను వైసిపికి మొట్టమొదటిగా ఆహ్వానించింది మాజీ వైసిపి అధ్యక్షుడు కే. హరిచంద్ర రెడ్డి అని ఆయన గత కొన్ని రోజుల్లో రకరకాలు సమస్యలు తలెత్తడంతో అతని నుంచి బయటికి వచ్చానని తెలిపారు. పత్రికలో వచ్చిన కథనాలు ప్రియతమ నేత కోనేటి ఆదిమూలంపై దుష్ప్రచారం చేయడం, నల్ల జెండాలతో తిరుగుబాటు చేయడం చాలా ఆవేదన అనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం సహకారముతో మండల పార్టీ అధ్యక్షుడిగా, సింగల్ విండో అధ్యక్షుడుగా, సతీమణికి ఎంపీపీగా చేసుకున్నామన్నారు. పదవులు పొంది ఇలా దారుణంగా ఎమ్మెల్యే పై తిరుగుబాటు చేయడం అన్యాయమని ఖండించారు. రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు మాట్లాడుతూ వెనుకబడిన సత్యవేడు నియోజకవర్గం వర్గానికి చెందిన ఎమ్మెల్యే ను విమర్శించే అర్హత ఉందా అని ఆత్మ పరిచయం చేసుకో, పిచ్చాటూరు మండలంలో అభివద్ధి పనులను కోసం ఎమ్మెల్యే పనులు తెస్తుంటే వాటిని అడ్డుకోవడం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, పార్టీ అధ్యక్షుడు చలపతి రాజు, ఎంపీటీసీలు రమేష్ రాజు, శోభన్ బాబు, పాల పద్మనాభం, తొప్పయ్య, వెంకటేశులు, సుబ్రహ్మణ్యం, బాబు, రమేశ్, నాగరాజు, చంద్రన్, శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










