May 03,2023 23:45

వధూవరులను ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి

ప్రజాశక్తి- అద్దంకి : అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం పలు శుభకార్యాలకు హాజ రయ్యారు. తొలుత అద్దంకి పట్టణంలోని రామనగర్‌లో కొండ్రగుంట రఘురామయ్య నూతన గహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన వస్త్ర బహూకరణ వేడకలో పాల్గొని చిన్నారులు కుమార్‌ సాయి చౌదరి, లక్ష్మీ కార్తిక్‌ చౌదరిని ఆశీర్వదించారు. అనంతరం మండల పరిధిలోని గోవాడకు చెందిన వీరాంజనేయులు, వెంకటరమణ దంపతుల కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధువు దివ్య తేజను ఆశీర్వదించారు. అనంతరం సంతమాగులూరు మండలం కుందుర్రుకు చెందిన చింతలపూడి చిన్న మస్తానయ్య కుమార్తె వివాహం సందర్భంగా వధువు దేవకిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అదే గ్రామానికి చెందిన బొడేంపూడి .శ్రీనివాసరావు, వరలక్ష్మి దంపతుల కుమారుడి వివాహం వరుడు వంశీకష్ణను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పత్తేపురంలో ఏలూరి వీరాంజనేయులు, వెంకాయమ్మ మనవరాళ్ల ఓణీల వేడుకలో పాల్గొని చిన్నారులు శ్రీనిక, కార్తీకను ఆశీర్వదించారు.