Jul 21,2023 21:25

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి గడిచిన నాలుగేళ్ల కాలంలో రూ.1000 కోట్ల ఆస్తిని సంపాదించి బాగా అభివద్ధి చెందారని ప్రొద్దుటూరు అభివద్ధి మాత్రం గాలికి వదిలేశారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక నెహ్రు రోడ్డులోని తన కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తాము చేసిన అభివద్ధి పనులకు తుది మెరుగులు దిద్ది ఆ అభివద్ధి పనులు తానే చేసినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి చెప్పుకోవడం హాస్యా స్పదంగా ఉందని వాపోయారు. రూ. లక్షల కోట్ల అప్పులు చేయడం తప్ప అభివద్ధి అనేది సిఎం జగన్‌ గాలికి వదిలేశారనిఆరోపించారు. మళ్లీ ఇదే ప్రభు త్వమే అధికారంలోకి వస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రజలు తమ ఆస్తులను ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వరదరాజులురెడ్డి ఎద్దేవ చేశారు. ఇసుక, క్రికెట్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ తదితర అసాంఘిక కార్యక్రమాలకు ప్రొద్దుటూరు పట్టణానికి కేంద్ర బిందువుగా చేశారని తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ టిడిపి పట్టణ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, శంకర్‌ నారాయణ, వద్ది బాలుడు పాల్గొన్నారు.