Jan 01,2023 23:39

విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే బాబురావు

ప్రజాశక్తి -నక్కపల్లి:స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌ 19 బాల, బాలికల రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. నక్కపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్‌ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ఆదివారం ముగిసాయి. మూడు రోజులపాటు జరిగిన హాకీ క్రీడా పోటీల్లో బాలురు విభాగంలో కడప మొదటి స్థానం లోను, నెల్లూరు ద్వితీయ స్థానంలోను, విశాఖపట్నం తృతీయ స్థానంలోనూ నిలిచాయి. బాలికల విభాగంలో తూర్పు గోదావరి ప్రథమ స్థానంలోనూ, కడప ద్వితీయ స్థానంలోనూ, ప్రకాశం తృతీయ స్థానంలోనూ నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే బాబురావు బహుమతులను అందజేస్తారు. క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నక్కపల్లిలో జరగడం చాలా సంతోషకరమన్నారు. క్రీడాకారులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఏనుగుపల్లి రత్నం, జెడ్పిటిసి గోసల కాసులమ్మ, సర్పంచ్‌ నేతల జయరత్న కుమారి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వీసం నానాజీ, వెలగ ఈశ్వరరావు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర పరిశీలకులు శ్యామల, ఉప సర్పంచ్‌ వీసం రాజు, బియస్‌ హాకీ ఫౌండర్‌ సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ, హైస్కూల్‌ చైర్మన్‌ కర్రి పద్మ, వైసిపి నాయకులు పాపారావు శేషరత్నం, నరసింహమూర్తి, తాతబాబు, దుర్గ ప్రసాద్‌, నానాజీ, రామచంద్రరావు, ప్రసాద్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు.