ఆస్పత్రి నుంచి బయటికి వస్తున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి -నక్కపల్లి :నక్కపల్లి సిహెచ్‌సిలో బుధవారం ఎమ్మెల్యే గొల్ల బాబురావు డాక్టర్స్, స్టాఫ్ తో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సమావేశానికి హాజరవ్వగా, డాక్టర్స్, స్టాప్ పూర్తిగా రాలేదు. ఎందుకని అడిగితే వాళ్ళు డ్యూటీలో ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండ్ జనార్దన్ బదులిచ్చారు. దీంతో ఎమ్మెల్యే బాబురావు తన పట్ల గౌరవం లేదని, సరిగ్గా పట్టించుకోలేదని అసం తృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎవరు రానప్పుడు ఇంకెందుకు మీటింగ్ పెట్టుకోవడం తాను తర్వాత ఎప్పుడో వస్తాను అనుకుంటూ జనార్దన్ పై అసహనం వ్యక్తం చేసి ఆసుపత్రి నుండి బయటకు వచ్చి వెళ్లిపోయారు.










