నరసరావుపేట: రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఐటిడిపి నాయకులు,కార్యక్రమాలను మరింత వేగవంతం చేయా లని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అర విందబాబు అన్నారు. పట్టణంలో స్థానిక నవయుగ కన్వెన్షన్ లో ఆదివారం నాడు ఐటిడిపి నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడంలో ఐటిడిపి నాయకులు ఇంకా చురుగ్గా వ్యవ హరించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా స్థానిక ఎమ్మెల్యే అవినీతి,అక్రమాలను ఎండగట్టాలని దిశా నిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్ట్యా ఐటీడీపీ నాయకులు పార్టీ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని చెప్పారు. సమా వేశంలో రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు,రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోట్ట కిరణ్, నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు,పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.










