ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వినుకొండ నియోజకవర్గంలో 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మూల్పురి అగ్రిటెక్ సంస్థ, వీరికి సహకరి ంచిన రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'జగనన్నకు చెబుదాం'లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లోకాయుక్తలో సురభి వెంకటేశ్వర్లు, హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేసిన కిర్తిపాటి వెంకటేశ్వర్లుకూ ఒత్తిళ్లు మొదలవుతు న్నాయని, వారికి, వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ భూము లపై మూణ్ణెల్లులోగా విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలనే తీర్పును అమలు చేయాలన్నారు. నూజెండ్ల మండలం తలార్లపల్లి పంచాయతీ దాట్లవారిపాలెంలో ఆర్‌ఎంపి వైద్యుడు పోతిరెడ్డి వెంకటేశ్వ రరెడ్డి 646/4 సర్వే నంబర్ 123 ఎకరాలు ఆక్రమించారని, ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఫలితం లేదని చెప్పారు. కార్యక్రమంలో భూ పోరాట కమిటీ కన్వీనర్ కోట నాయక్, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు వై.వెంకటేశ్వరరావు, డాక్టర్ జి.జాన్‌పాల్, ఎన్.శ్రీనివాసరావు, రెడ్ బాషా, మస్తాన్‌వలి, ఓర్సు కృష్ణ, జి.బాల, ఆర్.ప్రసన్నకుమార్, పి.విజరు, పి.రాజా, పి.అంకారావు, ఎన్.రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.










