ప్రమాణస్వీకారం చేస్తున్న చంద్రగిరి ఏసురత్నం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎమ్మెల్సీలుగా మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి, ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తొలుత భారీ ర్యాలీతో మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం గుంటూరు నుంచి వెలగపూడికి తరలివెళ్లారు.










