ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి : టిడిపి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు. సోమవారం పట్టభద్రుల ఓటర్లతో వారు సమావేశమయ్యారు. స్థానిక అనంత రామ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో తాలూకా టిడిపి యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డితో కలిసి ఆమె పట్టభద్రులతో మాట్లాడారు. పట్టభద్రుల టిడిపి అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారని ఆయనకు మద్దతు పలకాలని ఆమె అన్నారు. టిడిపితోనే పట్టభద్రుల సమస్యల పరిష్కారం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హుస్సేన్ బాష, నాగాంజనేయులు, అనంత విద్యాసంస్థల అధినేత అనంతరామ సుబ్బారెడ్డి, పట్టభద్రులు పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవరామ్ దంపతులు తాలుకా టిడిపి యువ నాయకులు జగత్ విఖ్యాత్ రెడ్డి లు బుడగ జంగాల కాలనీలోని జంబులాపరమేశ్వరి దేవిని దర్శించుకున్నారు.
నంద్యాల కలెక్టరేట్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని భూమా బ్రహ్మానందరెడ్డి కోరారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఎమ్మార్వో కార్యలయము, సబ్ రిజస్టర్, సబ్ ట్రెజరి, తెలుగు గంగ, కేసీ కెనాల్, మైనర్ ఇరిగేషన్ కార్యలయము, ఎస్ ఆర్ బీసీ, తాలూకా, 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ల నందు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ ఖలిల్, నాగార్జున, వలీ, జైనాబీ, శ్రీదేవి, కొండారెడ్డి, వినరు, బాస్కరరెడ్డి, తెలుగు దేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాగలమర్రి : పక్షిమ రాయలసీమ పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని టిడిపి నాయకులు కోరారు. సోమవారం చాగలమర్రి పట్టణంలో టిడిపి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మద్దతుగా టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాష, మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి ల ఆధ్వర్యంలో స్థానిక అజీం పబ్లిక్ స్కూల్,జిల్లా పరిషత్ బాలుర,బాలికల ఉన్నత పాఠశాల,సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలతో పాటు పట్టణంలోని పట్టభద్రులను కలసి ప్రచారం. నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వీరం రెడ్డి బాస్కర్ రెడ్డి,అజీం,ఇర్షాద్,గఫార్,శేఖర్, శ్యాబుల్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. సిరివెళ్ల : టిడిపి తరపున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఆళ్లగడ్డ ఇన్చార్జి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఎర్రగుంట్ల గ్రామంలో మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పుల్లారెడ్డి, జయరాం రెడ్డి, శీలం ప్రసాద్, స్థానిక సంస్థల ఇండిపెండెంట్ అభ్యర్థి భూమా వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.










