Nov 03,2022 00:02

మాట్లాడుతున్న ప్రమీల గాంధీ

ప్రజాశక్తి-కొత్తకోట:పట్టభద్రుల ఓటర్ల నమోదు చేసుకునే విధంగా విస్తతస్థాయి ప్రచారం కల్పించాలని ఏఈఆర్‌ఓ ప్రమీల గాంధీ స్పష్టం చేశారు. రావికమతం మండల తహ సిల్దార్‌ కార్యాలయంలో మండల్‌ లెవెల్‌, గ్రామస్థాయి అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2019 అక్టోబర్‌ 31 లోపు పట్టభద్రులైన వారి నుంచి వివరాలు సేకరించి ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.
త్వరలో జరగబోయే ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం ఎన్నికలకు సిద్ధం చేయాలని ఆమె చెప్పారు. గ్రామీణ ప్రాంత పట్టబద్ధులను గుర్తించి వారిని ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గతంలో ఉన్న ఓట్లన్నీ రద్దు కావడంతో అందరూ నూతన ఓటర్‌గా చేరాలని వివరించారు. అనంతరం మండల వ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాను ఆమె పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకన్నబాబు, ఇంచార్జ్‌ తహసిల్దార్‌ శేషు, పలువురు మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.
గొలుగొండ:పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఈ నెల 7వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2019 అక్టోబర్‌ నాటికి గాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని కోరారు.