ఓటరు నమోదుకు దరఖాస్తు అందజేస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి - ఆరిలోవ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుపై తోటగరువు టిడిపి కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఆదేశాలతో టిడిపి రాష్ట్ర అర్గనైజింగ్ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు అధ్యక్షతన 9, 10, 11, 12, 13 వార్డుల టిడిపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆరిలోవ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను, కార్యాలయాలు, కాలేజీలు, సచివాలయాల సిబ్బందిని కలిసి ఫామ్ 18ను వారికి అందజేసారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఒమ్మి అప్పలరాజు, బుడుమూరు గోవిందు, కార్పొరేటర్ మద్దిల రామలకీë, రాజశేఖర్, రాగతి అచ్యుతరావు, పొత్రకండ ధర్మారావు, గాడి సత్యం, పోలారావు, మూది అప్పారావు, ముగడ రాజారావు పాల్గొన్నారు.










