సమీక్ష చేపడుతున్న జెడ్‌పిటిసి
ప్రజాశక్తి-హుకుంపేట: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయాల కార్యదర్శులతో గురువారం జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం, ఎంపిడిఓ వెంకటరావు, తహసిల్దార్ రాజేశ్వరిల అధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి రేగం మత్స్యలింగం మాట్లాడుతూ,గ్రాడ్యుయేట్ యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయాలని కోరారు. మండలంలో 708 మంది మాత్రమే ఆన్‌లైన్‌లో ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఈ నెల 5వ తేదీ లోపు ఓటర్లుగా నమోదు చేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు భాస్కర్‌రావు పాల్గొన్నారు.










