ప్రజాశక్తి- మునగపాక రూరల్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టులో ఉన్న అవకతవకలను సరిచేయాలని సిపిఎం నాయకులు ఎస్.బ్రహ్మాజీ, ఆళ్ల మహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100కు పైగా దరఖాస్తులను పరిశీలిస్తే అర్హులైన వారివి ఓట్లు లేని పరిస్థితులు ఉండగా, డబల్ ఎంట్రీలు, తప్పుడు ఎంట్రీలతో పాటు, అనర్హుల పేర్లు ఓటర్ లిస్టులో నమోదై ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి రసీదులు అయితే ఇచ్చారుగాని లిస్టులో పేర్లు లేకపోవడం వలన అర్హత కలిగిన పట్టభద్రులు నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తక్షణమే ఓటర్ లిస్ట్‌ను సరిచేసి కొత్త లిస్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టెక్కలి జగ్గారావు, ఆళ్ల సూరిబాబు పాల్గొన్నారు.










