Mar 09,2023 00:03

విచారణ చేస్తున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి-గొలుగొండ:ఎమ్మెల్సీ ఓట్ల తొలగింపుపై మండలంలోని పాకలపాడులో బుధవారం అనకాపల్లి ఆర్టీవో చిన్నికృష్ణ విచారణ చేపట్టారు. పాకలపాడు పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టి ఓట్లు నమోదు చేసుకున్న వారి వద్ద నుండి వివరాలను సేకరించారు. ఏడు ఓట్లు తొలగించారని పట్టభద్రులు నమోదు చేసుకున్న ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ఆనందరావు, రెవెన్యూ కార్యదర్శి స్వామి, స్థానిక పట్టభద్రులు పాల్గొన్నారు.